కళ్ళు.....శ్రీనివాస భారతి
కళ్ళు.....శ్రీనివాస భారతి
అవి
నెత్తురు చూశాయి
బాంబులు వేసాయి
దయ చూపాయి
ఈర్ష్య కక్కాయి...కొందర్లో
పూ లందాలు తెలీదు
రూపురేఖలు చూళ్ళేదు
నీ చూపు లెక్కడో గుచ్చినా
నా ఆశలు ఆకాశంలో
ఇంతకీ
నాకు కళ్ళు అవసరమా
నీ చూపులు నన్నెక్కడో తాకితే
నీ ఊహలు నన్ను బాధిస్తే
చెప్పగలవా
ఆ కళ్ళు సీరియల్ చూసే అమ్మాయివా
సెల్లో మునిగే అబ్బాయివా
బాధ్యత తీర్చిన తండ్రివా
*********&౪౪౪౪౪౪*********