కళ్ళు ముందు ప్రేయసి
కళ్ళు ముందు ప్రేయసి
తొహరివిల్లు! లకరి జల్లులు పుడమి తల్లిని
ముద్దాడుతుంటే హాయైన వాతావరణంలో..
అందంగా విరుస్తుంది సప్తవర్ణాల శోభతో మెరుస్తున్న
హరివిల్లులో.. సమ్మోహనంగా నీ రూపం..
నా కళ్ళనలాగే సంబ్రమాశ్చర్యాలలో ముంచేస్తుంటే ..
నింగివైపు చూస్తూ నిలబడిపోయాను!
వెన్నెల రాతిరి వేళ.. పున్నమి కాంతుల శోభలతో..
జాబిలమ్మ అలా అలా కదలి వెళుతుంటే..
నీ చిరునవ్వుల వదనం.. మరోసారి సరికొత్తగా ఆవిష్కృతమవుతుంటే..
కళ్ళలో నీ రూపాన్ని నింపుకుంటూ.. మౌనమై ఆగిపోయాను !
తొలిపొద్దుల వేళ.. వీచే మలయమారుతాలు.. మేడ ప్రక్కనే
వున్న పూల మొక్కల.. సుమగంధాల పరిమళాలను వెంటేసుకుని
వస్తుంటే .. అగుపించని నువ్వు.. కలవై.. కళ్ళలో కదులుతుంటే..
లేచి చుట్టూ చూసుకున్నాను.. ప్రక్కనే నువ్వు.. కలో..
నిజమో అర్థమవని సందిగ్ధం!
ప్రియా.. నా ఉశ్వాసనిశ్వాసాల రూపమై నువ్వు..
నా ప్రాణమై నువ్వు.. నిన్ను వీడలేని... నేను!
మళ్ళీ తిరిగి మౌనమై నేను!

