కలల కవిత
కలల కవిత
కలల కవిత రాసుకున్నా............
అలతి పదమే అల్లుకున్నా............
చందురుని కళనే కన్నానా.............
పైరు ఊసులనే విన్నానా.............
జాజుల అందం నచ్చానా.............
గాజుల గలగల మెచ్చానా.............
లలిత ప్రియ కమలం అయ్యానా...........
నిశిలోని తారల్ని అల్లానా.............
మల్లెలుగా జడలో ముడిచానా.............
పున్నమి వెన్నెల కోరానా..............
సందె వెలుతురునై వేచానా.............
చల్లని చిరుగాలి ని నేనా............
పూల సౌగంధం నాదేనా.............
ప్రవహించు నదిలా ఉన్నానా..............
సాగరపు స్నేహం చేశానా..............
స్వాతి వానల్లే కురిశానా...............
మంచు ముత్యంలా మెరిశానా.............
ప్రతి భావనలో మునిగానా.............

