STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కెరటానికి సలాం

కెరటానికి సలాం

1 min
4

ఆకాశం అందించిన..కెరటానికి సలాంసలాం..!

వరమిచ్చిన గజల్ వాణి..గగనానికి సలాంసలాం..!


ఇంద్రధనువుల పొదరిల్లే..చూపిందే నాకోసం..

పసిడిపూల పానుపు చెలి..హాసానికి సలాంసలాం..!


ముద్దిచ్చే పిల్లగాలి..దుపట్టాను పట్టుకెళ్ళె.. 

వేణువింటి సరాగాల..కలహానికి సలాంసలాం..! 


వెన్నెలసిరి వడ్డించే..నవపున్నమ వీణియ తను.. 

ముచ్చటైన ఆ మోహన..రాగానికి సలాంసలాం..! 


సాక్షియైన పెదవిచాటు..హృదయమెంత మనోహరం.. 

మౌన మానసాదేవీ..పీఠానికి సలాంసలాం..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance