STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కేరింత

కేరింత

1 min
318

థియేటర్లో నవ్వులు

నాలో కేరింత

గుళ్ళో మోగిన గంటలు

నాలో కేరింత

నీ అధరాల పైన నా పేరు

నాలో కేరింత


కనుపాపల్లో నీ రూపు

అలిసిన నా పాదాలు

నిన్ను చేరితే చాలు

ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది

ప్రియుడి లేఖ ప్రియురాలికి కేరింత


FM లో కొత్త పాట

నాలో కేరింత

సమోసా రుచి ఆస్వాదన

నాలో కేరింత


ఓ ఆత్మీయ పలకరింపు

నాలో కేరింత

నేనే ప్రకృతి అయినట్లు

అంతా ఏదో కొత్త వింత


అదిగో మళ్లీ నువ్వే

నాలో కేరింత


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract