ఓ భారతి
ఓ భారతి
ఓ భారతి,
హిమాలయాలే నీ మెడకు ఉరితాడే,
కులము కట్టదా నీకు పాడె. పక్కింటి పెద్దన్నే నిప్పులు కురిపిస్తుంటే,
తోబుట్టిన తమ్ముడే చేతులు విరిచేస్తుంటే.
నీ కోడుకులు కొట్టుకు చస్తుంటే, ఆపని విగ్రహానివైనావా,
చచ్చినవారికిచ్చే నష్టపరిహారమైనావా?
ఆపాదమస్తకం నగలు వేసే నువ్వే, అప్పుల కొండైనావా.
వీరులను కన్న నీ గర్భం, చవటలకు జన్మనిచ్చిందా.
మహానులకు పాలిచ్చిన నీ స్తన్యం, వెధవల ఆట బొమ్మైందా.
లంచపు లాంచనాలతో నీ పెల్లి జరిగిందా.
అంటరానితనం నీ చేతుల బురదైందా.
రాజకీయ బురదతో నీ చీర నలుపైందా.
కడగ వలసిన జన జలమే మురికైనదా.
అన్నార్తుల అరుపులు నీ స్వరమైందా,
రైతుల నెత్తురు నీ నుదుట బోట్టైందా.
