ప్రాంజిలి
ప్రాంజిలి
ఓ దేవా ! లోకపావనా !
ఏమిటయా నీ మాయ
లోకమంతా పూల వనలే
అడుగడుగున అందాల
సుందర నందన వనాలే
వీక్షించ
నయనాలు రెండే ఇచ్చావు
ఆ పూల మనసులు
మరి మాకేల నీయవో
లోకమంతా గలగల
పారే సెలయేరులే
అడుగడుగున అందాల
నయాగరా జలపాతాలే
మది దాచుకొనుటకే
గుప్పెడు మనసు నిచ్చావు
ఆ మేలుచేయు మనసును
మరి మాకేల నీయవు
లోకమంతా చల్లని
మలయ మారుతాలే
అల్లనల్లన వీచు
పారిజాత వింజామరాలే
ఆస్వాదించే మనసున
సుడుల అలజడుల నిచ్చావు
ఆ సేదదీర్చి ఓదార్చే
కరుణాంతరంగం మాకేల నీయవూ
మంచి గంధము వంటి
మల్లెల పరిమళ మంటి
సనజాజుల సొగసు వంటి
పసిపాపల నగవు వంటి
సుకుమార సౌహార్థ దయాపూరిత
శాంతిమయ రసాప్రాదిత ప్రపుల్ల
" మ న సు "
మాకందరికీ ప్రసాదించు దేవా
