వెన్న దొంగ
వెన్న దొంగ
కడుపున పడకనే
మేనమామకే
ఖైదుగా పుట్టాడు...
కన్న పేగును వదిలేసి
పెంచిన పాశానికై
పాకులాడాడు...
దిన దిన గండాన
క్షణమొక
వింత నాటకం చూపాడు...
సవతుల మధ్య
సంకెళ్ళు లేని
బందీయే తానయ్యాడు...
నమ్మిన వారికోసమే కానీ
ఏనాడు రాజ్య కాంక్ష లేని మారాజు...
స్వచ్చమైన ప్రేమకు...
నిస్వార్థ భక్తికే కానీ
ఆర్భాటాలకు లొంగనన్నాడు...
వెన్నెల దొంగ అన్నా...
కన్నెల దొంగ అన్నా...
చిరునవ్వుల వెన్నెలలు పూయించాడు ...
నిందలెన్నో మోసాడు...
చివరకు గోపాలుడై నిలిచాడు...
దామోదరుడై అవనికేతెంచాడు...
మందస్మిత మృదు మదన...
గోవింద అన్న నామానికి
కట్టుబడి పోయాడు...
