జాబిలి పై మన జెండా
జాబిలి పై మన జెండా


జాబిలిపై మనజండా..రెపరెపలకు తిరుగులేదు..!
మన "ఇస్రో"ప్రయోగాల..కుశలతలకు అడ్డులేదు..!
శాస్త్రజ్ఞుల తపోదీక్ష..విశ్వజనని రక్షణకే..
మనభారత సాంకేతిక..నిపుణతలకు పొంగులేదు..!
కలలుగన్న 'కలా'మెంత..ధీమంతుడొ చెప్పాలా..
ఆడుతు పాడుతు చేసిన..సాధనలకు ఎదురులేదు..!
మరి నవ్విన నాపచేనె..వజ్రఫలము లిచ్చెనెలా..
మౌనముగా అందుకున్న..విజయసుధకు రంగులేదు..!
మోదీజీ అండతోటి..సోమనాథ విజృంభణ..
సామూహిక ప్రజ్ఞసాక్షి..శృతిలయలకు కులములేదు..!
తెలివన్నది ప్రతి ఒక్కరి..సొత్తేమరి తేట ఏది..
చైతన్యపు బావుటాల..శబలతలకు హద్దులేదు..!