STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కడలి

కడలి

1 min
330

నన్ను నీలో కలిపేసుకోవలన్న నీ ఆరాటంలో 

నేనూ కడలి అలనైపోవాలనుంది..

నీ అడుగులు నాతోనే సాగాలన్న నీ ఆశకి 

నేనో జీవనదిలా పొంగిపోవాలనుంది..

నీ మాటల్లో నా మౌనాన్ని నింపేసుకుంటున్నందుకు నేనో జీవనవేణుగానాన్నై వినిపించాలనుంది..

నీ గుండెలయగా నన్నే వింటున్నందుకు 

నీ ఉఛ్వాస నిచ్వాసలలో 

ఓంకారాన్నై ఉండిపోవాలనుంది..

నీ అణువణువులో నన్నే దాచేసుకున్నందుకు

ఏనాడో నేనే నీవైపోయాననన్న నిజం 

నీకు చెప్పేయాలనుంది...


... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance