కడలి పరిమళం
కడలి పరిమళం
ప్రభాత వేళ సాగరమధనంలో మురిసి మధురమైనది మది
కడలి కెరటాల అల్లరి సవ్వడికి ఉప్పొంగిపోయిన్ది హృది
గర్జించే సాగరఘోషను అవలోఖిస్తే వేగం పెరగదా గుండె సవ్వడి
తనలో ఆటలాడే జనులను చూస్తే పరవశించి పోదా మనసు గది!!
ఎగసే కెరటలకి ఎంత గర్వం!
లోకానికి తను పడిలేచే తనం ఆదర్శమని
దూరాభారం ఎంతైనా పయనంలో అలుపు రాకుండా
గెలుపు కోసం పరుగు పెడుతుందని
కడలి పై ఆధారపడే జీవితాలను ఆలవొకుగా
ఆకలి తీరుస్తానని!!
కడలికి ఎంత కావరం!
అనంత కోటి జీవ జాతుల నెలవుకు కారణాభూతం తానని
తరిగిపోని సంపదల నిలయం తన సొంతమని
భూమి లో ఆత్యధిక భాగం తనే నిండి ఉందని
ఏ నదిజలలైన, ఎన్ని హొయలు పోతూ పరుగులు పెట్టినా
చివరికి తనలోనే సంఘమించాలని!

