కడలి మనసు
కడలి మనసు
ఏమి నీకు చెప్పను..ఏమి బదులు ఇవ్వను..!? ఆశ లేదు దాచను..ఆట లేదు ఆడను..! తలపు నిన్ను విడువదు..గాలిఅసలు ఆడదు..! పడదు అడుగు కదలను..పాట లేదు పాడను..! కడలి మనసు ఆగదు..వింతపొంగు చూపదు.. రాదు పగలు చూడను..రేయి విడదు జరుపను..! గొడవ పడదు నిలువదు..చింత నిప్పు ఆరదు.. లేదు విషము మింగను..లేదు మధువు త్రాగను..! విప్ప గొంతు పెగలదు..బాధతీపు తరగదు.. లేవు కలలు కనగను..లేవు కథలు వ్రాయను..! వెతకలేదు కోరదు..వేడుకోలు తెలియదు.. లేదు తలుపు వేయను..లేవు వలలు విసరను..!
