STORYMIRROR

Midhun babu

Romance Fantasy Others

4  

Midhun babu

Romance Fantasy Others

కౌగిలింత

కౌగిలింత

1 min
4



మమతలు నిండిన మనసుకు 
తరగని మమకారపు ఊసేగా కౌగిలింత,
అలసిపోని తలపుల మదిముచ్చటేగా కౌగిలింత.

పరుగెత్తే పరువపు ఆశకు 
తీయదనాల హృదయస్పర్శే కదా కౌగిలింత,
గుండెవేడిలో హత్తుకుపోయిన చలిపూజే కదా కౌగిలింత,
వయ్యారపు వలపుకు 
కవ్వింతల తాపం తీర్చేదేకదా కౌగిలింత.

అలసుకాని ఆశల ముంగిట 
శ్రుతి లయల ప్రణయరాగమే కౌగిలింత,
స్నేహమైన కామదాహమైన 
అల్లరికాని విశ్వాసమే 
మనసులను ఏకంచేయు కౌగిలింత,
సత్యమైన అనుబంధపు సొగసులతో 
సరసహృది విన్నపమే కౌగిలింత,
జన్మజన్మల బంధాలకు 
ప్రేమను శాశ్వితం చేయు ఆత్మీయతే 
తనువునేలు కౌగిలింత.


Rate this content
Log in

Similar telugu poem from Romance