కారణం నువ్వే...
కారణం నువ్వే...
కారణం నువ్వే...
కన్ను నిన్ను చూసినప్పుడు
మిన్ను తాకినంత ఆనందమేసింది
మన్ను మీద నేనున్నా టన్ను బరువు
నామీదున్నట్టుంది నీ అందం అద్భుతం
నా ఆనందం అనంతం నీ అడుగులకు జతౌదామనుకున్నా
అడుగు కాదు కదా అణువు కూడా కదపలేకపోయా
నాపాదం జరిగే నిన్ను చూస్తూ జగాన్ని మరిచా
జతగా నన్ను ఇస్తూ యుగాన్ని పరిచా
నిదురలో కలవరింతలకు కునుకు దారి తప్పి
కలగా మారి అలలా కదులుతున్న
నీ రూపం తారాడిందిశకంటికి కునుకుంటే ఒట్టు
ఇదంతా నీ కనికట్టు సమయాన్ని తొందరపెట్టి
నిన్న నిన్ను చూసిన జాగా వద్ద పాగా వేశా
నిజం చెప్తున్నా. కారణం నువ్వే...

