కాంతి పూలు
కాంతి పూలు
కోయగాను దొరకనివే..వాడిపోవు కాంతిపూలు..!
పంచుగుణం ఉందంటే..తరిగిపోవు కాంతిపూలు..!
పల్లెతనం మధురిమలే..పాడుటకే అందవులే..
అనుక్షణం అందునులే..నవ్విపోవు కాంతిపూలు..!
ఉదాయారుణ సోయగాల..పానుపుపై విరిసేనా..
నడకవేళ అలరించగ..అలిగిపోవు కాంతిపూలు..!
కొక్కొరొకో రాగంతో..మేలుకొలుపు చైతన్యం..
హృదయగగన వీధులలో..వెలిగిపోవు కాంతిపూలు..!
వేపచిగురు చేదుతోటి..మధురమైన ఆరోగ్యం..
ఇష్టమెంతొ పెంచేనా..నిండిపోవు కాంతిపూలు..!
కావుకావు మనుకాకుల..సందడెంత మనోహరం..
సన్నాయిని మరిపించును..రాలిపోవు కాంతిపూలు..
