కాలం
కాలం
కాలం మెల్లగ నేర్పే..కమ్మని పాఠము మెచ్చెద..!
నామదినేలే చిక్కని..చక్కని మౌనము మెచ్చెద..!
ఏమని చెప్పను నాలో..నిండిన ప్రేమకు అర్థం..
కన్నుల తోనే నీవై..కురిసే రాగము మెచ్చెద..!
అలుకల అందం చూడగ..తలచే మనసే ఎందుకొ..
పాడగ అందని స్వరముల..దాగే గీతము మెచ్చెద..!
నీవని నేనని విడిగా..ఎచటో చూచుట ఎట్లో..
నన్నే'మార్చే పనిలో..పని నీ స్నేహము మెచ్చెద..!
ప్రేమను వలలో పడగా..మిగిలే సౌఖ్యం ఏమది..
నీవుగ నిన్నే ఫణముగ..పెట్టిన త్యాగము మెచ్చెద..!
ఎంతటి భోగం అంతా..మాయే శాశ్వత మేదట..
జ్ఞానము నిచ్చే శ్వాసల..సాక్షీ ధ్యానము మెచ్చెద..!
