STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలం ఒడిలో

కాలం ఒడిలో

1 min
9



కాలం ఒడిలో వాలే..లోగా మత్తును వదలాలి..! 
అద్దం నిత్యం ఇచ్చే..జ్ఞానం ఎఱుకన ఉండాలి..! 

కొండలు దూకే యేటికి..నడకలు ఎవ్వరు నేర్పేరు.. 
చెలిమిని పంచే గుణమే..మదిలో నీవే ఎదగాలి..!

ప్రేమను లేఖన వ్రాయగ..చేతికి మాటలు దొరుకులే.. 
మౌనం సాక్షిగ మనసును..ఊయల చేసే తీరాలి..! 

దైవంపలికే సంగతులేవో..వినగా శ్రద్ధను పొందగా..
ఆజ్ఞాచక్రం పైనే..దృష్టిని చక్కగ నిలపాలి..! 

చినుకుల టపటప బాలల..పడవల సందడి ఏదంట.. 
అంతర్జాలపు మాయా..జాలం మోజే రాలాలి..! 

రాక్షసులెవరో లేరోయ్..ఇక్కడ అంతా నాటకం.. 
యోగుల రాజ్యం వచ్చే..తీరగ ధ్యానం పెరగాలి..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics