STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

కాలమా సాగిపో

కాలమా సాగిపో

1 min
386

కదిలే కాలానికి తెలియదు

అది తిరిగి రాదని

అమ్మ చేతి గోరుముద్దలు

తినే పసికందుకు తెలియదు

పెరిగి పెద్దయ్యిన తరవాత

ఈ గోరుముద్దలు తినిపించే అమ్మ

ఇక తినిపించిదని

పాఠశాలలో చెట్టాపట్టాలేసుకొని

తిరిగేటప్పుడు తెలియదు

ఈ నేస్తాలు విడిచి వెళతారని

చిన్ననాటి ఆ కలలకు తెలియదు

అవి చెదిరిపోయే కలలు అని

పట్టు విడని మనసు కు తెలియదు

ఏది మంచి ఏది చెడు అని

కదిలే కాలమా నీవు

చెదరని కలవా లేక

సాధించే నిజమా అది

తెలిసిన నాడు మనిషి

మహానుభావుడవుతాడు 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational