కాలిపోయే ఖర్మం
కాలిపోయే ఖర్మం


"రాలిపోయే పువ్వా రాగాలెందుకే"
పాటకు అనుసృజన
కాలిపోయే ఖర్మమా కార్పణ్యాలెందుకే
ఆదుకునే నాధుడు లేడుగా
కూలిపోయే కుహనమా బేషజాలెందుకే
శోకమెన్నడో చేరువాయెనే
నీకిది తేరుకోలేని బాధమ్మా
పలికి ఓ పలకని మాట వినిపించకే సన్నని నీ సలాపం
కాలిపోయే ఖర్మమా కార్పణ్యాలెందుకే
ఆదుకునే నాధుడు లేడుగా
కూలిపోయే కుహనమా బేషజాలెందుకే
శోకమెన్నడో చేరువాయెనే
చెదిరింది నీ కల చేరువకాక చెవులలో చెప్పుకునే కథగా
పన్నీటి హారాలు కన్నీటి కాసారాలు కాగా..ఆ.....
అయినవాడు ఆకాశాన్నే చేరగా
తనువునున్ప తాళిబొట్టు జారగా
ఏడేడు వర్ణాలు వెలిగేసి వెలుగారిపోగా
ఒరిగే భారాన్ని ఒద్దికతో నిలిపే వేగుచుక్కవై
అరిగే ఆయువవు నీవై కొడికట్టే దీపానివై
కాలిపోయే ఖర్మమా కార్పణ్యాలెందుకే
ఆదుకునే నాధుడు లేడుగా
కూలిపోయే కుహనమా బేషజాలెందుకే....
అనురాగమంటేనే అడగని అప్పులే
తొలగే బందాలన్నీ పొగ మబ్బులే
వసంత పరాగాల పూబంతులే వాడిపోయే..ఆ...
తన అనుబంధాల రుణమే తనకు మిగిల్చే రణమే
ఆశల హృదయానికి నిరాశల నిట్టూర్పులాయే
శోకాల రాగం నీవై జారిపడే జావళివై
మోకాల మొదలు కదల్చలేనీ వ్యథవై
కాలిపోయే ఖర్మమా కార్పణ్యాలెందుకే
ఆదుకునే నాధుడు లేడుగా
కూలిపోయే కుహనమా బేషజాలెందుకే
శోకమెన్నడో చేరువాయెనే