కాలచక్రం
కాలచక్రం
కాకచక్ర గమనంలో
మరో ఆవృతం....మొదలు
పాటలుపాడే కోయిలలూ
తోటన విరిసే కుసుమాలు
చల్లగ వీచే పవనాలూ
అన్నీ మార్పునకు లొంగిపోతాయి.
మండే ఎండల మంటలలో
మామిళ్ళూ మల్లెపూలూ
మొదలవుతాయి....
జీవితంలో ఆరాటాలు
చేయవలసిన పోరాటాలు
చేరవలసిన గమ్యాలూ
మారక కొనసాగుతాయి.
నేడు ఎంత కఠినమైనా
రేపు బావుండాలని
ఈవేళ కోరుకుంటూ
సాగిపోయే జీవితాలు
కాలం మాయాజాలంలో
సమాధానంలేని ప్రశ్నలు
ఆశ చావని ఆకాంక్షలు
మనుషుల జీవితాలు...
నిరంతరం గా సాగే
జీవనస్రవంతిలో
నడుమన వచ్చే మజిలీలే
ఉగాదులూ ఉషస్సులూ
మరో మంచి ఉదయానికి
కోటికలలతో...
... సిరి ✍️
