కాల మహిమ
కాల మహిమ


కాల మహిమ కాకపోతే
గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు,
నేను నిన్ను నమ్మాను,
కోడి చికెన్ షాపు వాడితో స్నేహం చేసినట్టు,
నేను నీతో స్నేహం చేశాను,
నా సమయమంతా నీకిచ్చేశాను,
నా తెలివినంతా నీ బాగు కోసం ఉపయోగించాను,
ఇంక నే నిన్ను నమ్మలేను,
నా జీవితం నాది,
నాకున్న బాధ్యతల కోసం,
నాకు మిగిలిన కాలాన్ని వెచ్చిస్తాను.