STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
204


ఓ జ్ఞాపకం 

నిశిలో నిండు శశి 


ఓ జ్ఞాపకం

నడి చీకటి లో నక్షత్రం


ఓ జ్ఞాపకం

తిమిరంలో మెరిసే మిణుగురు


ఓ జ్ఞాపకం

నా రెప్పల సంద్రం లో కురిసే జోరువాన


ఓ జ్ఞాపకం

ఎడారి గుండెలో నిట్టూర్పు సెగ


ఓ జ్ఞాపకం

నిత్యం చెంపలపై ఇంకిపోయే చారిక


ఓ జ్ఞాపకం

మది నదిలో మునకలేస్తున్న నావ


ఓ జ్ఞాపకం

సునామీ లో కొట్టుమిట్టాడిన సలపరం


ఓ జ్ఞాపకం

అలల నురగలపై తేలు చిరు నవ్వు


ఓ జ్ఞాపకం

మండుటెండల బ్రతుక్కినిండు పున్నమి


ఓ జ్ఞాపకం

నా కంటి చెమ్మను చేరిన తీరని స్వప్నం


ఇన్ని జ్ఞాపకాల జల్లులతో తడిసిన 

నా బ్రతుకు పుస్తకంలో

పలవరించినవి సలపరించినవి

మలుపు తిప్పినవి తిప్పబోతున్నవి

ఎన్నో.. ఎన్నెన్నో... ఇంకెన్నో...

జ్ఞాపకాల కలబోతతో

మరింత మధురంగా

మారబోతున్న మరెన్నో పుటలు

నా సొంతం కావాలని

ఆ పుటలన్నీ జ్ఞాపకాలతో నిండి

"ఒక మధురమైన జ్ఞాపకం"గా

చరితలు చదవని పుస్తకం గా

నిలిచిపోయేలా మార్చుకుంటాను

జన్మ సార్థకం గావిస్తాను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy