STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జ్ఞాపకాల తుఫాన్

జ్ఞాపకాల తుఫాన్

1 min
273

జ్ఞాపకాల తుఫానెంత..అద్భుతమో చెలియా..! 

ఒక సాక్షిగ బ్రతుకుటెంత..విశేషమో చెలియా..! 


బాధకన్న బహుమానం..ఉండదనే తెలిసెను.. 

వెర్రి ప్రేమ యోగమెంత..విషాదమో చెలియా..! 


రాచిలుకల రాణిలాగ..ఎగిరిపోతి వెచటికి.. 

ఈవియోగ రాగమెంత..దారుణమో చెలియా..! 


ఎవరితోటి పంచుకోను..మాటలేమి చాలును.. 

మౌనాక్షర సంద్రమెంత..అమోఘమో చెలియా..! 


ఏపూవులు సరితూగును..నీ పూజను సేయగ.. 

నీ పవిత్ర హాసమెంత..మోహనమో చెలియా..!


Rate this content
Log in

Similar telugu poem from Romance