జ్ఞానపదం
జ్ఞానపదం


ప౹౹
బాల్యమంతా గడిచెనే విని అమ్మమ్మ కథలు
కల్యమంతా మదిలో ఆ ఊసే మళ్ళీ మెదలు ౹2౹
చ౹౹
రామాయణ భారతాలూ రంగరించి రంజుగా
ప్రేమాయణ పురాణాలే వివరించు తరచుగా ౹2౹
కావ్యమైనా కమనీయముగా వినుపించుగా
శ్రావ్రమైన స్వరముతో రాగమే ఆలపించుగా ౹ప౹
చ౹౹
అందమైన ఓ దీవిలో అందాలొలికే సుందరి
అందులోనే రాక్షసుడూ నివసించు ముందరే ౹2౹
వాడి దుష్కార్యాలు రూపుమాపుగ యువతి
తోడికొని ఒక నాయకుడిని తనతో ఆ వలతి ౹ప౹
చ౹౹
ఆ జానపదాలు జనపదాలుగా తలపించునే
ఏ జ్ఞానపదమైన కథ రూపంలో ఆలకించునే ౹2౹
ఎదలో నిలిచినే నీతి వాక్యాలు కథలుగానూ
ఎడద నుండి తరలు తలచిన గాధలుగానూ ౹ప౹