STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

జంట కలహం

జంట కలహం

1 min
2


మాటల ముడులు విడి

తెగింది బంధం .

సగాలుగా మిగిలిన

ఇరువురి నడుమ

సుడులు తిరుగుతుంది మౌనం.


సహన వారధి కూలిపోగా ,

ప్రేమ సారధి మునిగిపోగా ,

ఆగింది .అనురాగ ప్రయాణం .

పంతపు తాళం వేసి ,

తలపుల తలుపులు మూసి ,

మదిగదిలో ఒంటరిగా కూరుచుంటే

సుప్తావస్థలోకి జారిపోతుంది జీవితం .

ముందుకేస్తే చెరో పాదం

దిద్దుకుంటే ఒకో తప్పిదం

మలుపు తిరిగిన

బ్రతుకు దారిలో

ఎదురు చూస్తుందో

మధుర ఘట్టం .

    


Rate this content
Log in

Similar telugu poem from Romance