STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics Inspirational

4  

Dinakar Reddy

Abstract Classics Inspirational

జంగమా.. లింగమా..

జంగమా.. లింగమా..

1 min
305

భక్తికి వశమై తిన్నడి బంటువైన శ్రీకాళహస్తి లింగమా

భక్త మార్కండేయుని ఆయువు కాచిన మంత్రమా

భక్తురాలైన కరైక్కాల్ అమ్మయ్యార్ ని అమ్మా అని పిలిచి మురిసే కైలాస లింగమా

భక్త సిరియాళుని ఆనందమా

భక్తులతో ఆటలాడుతావు

వారు అడిగితే కాళ్ళు నెత్తిన పెట్టుకుంటావు

మేలు సామివి జంగమా

అట్టి నిన్ను ఏమని కోరాలి

శివభక్తి తప్ప ఇంకేమి అడగగలను

శివభక్త విజయములు రచించి భజించి

నిన్ను చేరి తరించు మార్గము తప్ప ఇంకేమి కోరగలను

హర హర మహాదేవా అంటూ

నిన్ను చేరనీయవయ్యా శ్రీకాళహస్తీశ్వరా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract