STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జీవితం

జీవితం

1 min
354

నన్ను నమ్మిన చెలిమికి

నాపై పల్లెత్తి మాట పడనీయని నేస్తానికి

నాకు వెన్నుదన్నుగా ఉన్న ధైర్యానికి

అమాయకత్వం అని తెలిసీ 

నన్ను మన్నించిన మనసుకి

మంచి చెడులు తెలియజెప్పిన మనిషికి

తిరిగి ఏమివ్వగలను కృతజ్ఞతలు చెప్పడం తప్ప...

బాధల్ని పరిచయం చేసే బంధుత్వాల కంటే

ప్రశాంతతనిచ్చే ఒంటరితనం గొప్పది

అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే

బాధల్ని తట్టుకోగలిగే కన్నీళ్లే గొప్పవి

సౌకర్యాలనిచ్చే ఆస్తులు కంటే

సంతోషాన్నిచ్చే తోడు గొప్పది...


... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance