జీవితం
జీవితం
నీకు
నచ్చినా నచ్చకపోయినా
ఇక్కడ బతకాలంటే
నటించవలసిందే…
సంతోషాన్ని
బలవంతంగానైనా
మొహంపై రుద్దుకుని
రానంటున్న నవ్వును
పెదాలపైకి లాక్కోవలసిందే…
నీ గాయాల బాధను
మనసులోనే దాచుకుని
పొగడ్తల పూలు జల్లాల్సిందే…
అందరూ తీయని అబద్ధాల రుచికి
అలవాటు పడ్డాక…
చేదులాంటి నిజం
ఎలా మింగుడు పడుతుందనుకున్నావు?
మనుషులిప్పుడు
మనసులను కాదు,
మనం వేసుకున్న
ముసుగుల అందాన్నే ప్రేమిస్తున్నారు…
