జీవితం
జీవితం
అందరున్నా ఒంటరి వాళ్ళం.
స్వేదన్ని హత్తుకొని ఆలోచనల్లో ఉడికిపోతాం.
మా కష్టాన్ని మేము నమ్ముకుంటాం.
జైలు జీవితాన్ని గడుపుతాం.
గడిచే రోజులకోసం ఎదురుచూస్తాం.
రాత్రుళ్ళు నిద్ర లో కుటుంబంలు
గుర్తుకు వచ్చి ఉలిక్కిపడిన రోజులెన్నో.
పైకి నవ్వుల పువ్వులు పూయిస్తాం.
లోలోపల కుమిలిపోతాం.
మాకు మేము ఓదార్చుకుంటాం.
కుటుంబాల కోసం నవ్వుతూ భరిస్తాం
వచ్చిన బాధలను.
వలస జీవితపు బ్రతుకు నెట్టుకువచ్చే
సహోదరులం.
ఎడారి జీవులం గల్ఫ్ దేశాల కార్మికులం.
మా ప్రయాణం సుదీర్ఘం.
రెండు సంవత్సరాల గడపడం కోసం
ఎన్నో రోజుకు ఎదురుచూసే గల్ఫ్ బిడ్డలం.
