"జీవితమొక వైకుంఠపాళి ..!"
"జీవితమొక వైకుంఠపాళి ..!"
"జీవితమొక వైకుంఠపాళి ..!
ప్రతి ఒక్కరి జీవితం
ఒకటితోనే మొదలు
వందతోనే ముగింపు
నిచ్చెనలు ఎక్కించే ఎత్తులు
సర్పాలు కాటేస్తే పల్లాలు
ముందుకు కదులుతుంటే పైకి సంతోషించినా ...
లోపల మాత్రం వెనక్కు నెట్టాలనుకునే శత్రువులు
వెనక్కు జారుతుంటే పైకి నిరుత్సాహ పడినా ...
లోలోపల ఆనందపడే వెన్నుపోటు స్నేహితులు
అడుగడుక్కి ఎదురయ్యే గండం
పోసే పోత మీదే ఆధారపడే ఆ అదృష్టం
చివరవరకూ ఎంత కష్టపడి విజయ తీరానికి చేరినా,
ఆ అదృష్టం కాస్త లేకపోతే!
చివరి మెట్టు సైతం ముందుగా చేరడం కష్టమే !!
-mr.satya's_ writings ✍️✍️✍️
