జీవిత కవితా గీతం - లతాజీ --
జీవిత కవితా గీతం - లతాజీ --
Telugu Version .
జీవిత-కవితా గీతం ( పాట )
పల్లవి : ఓహో సౌమ్యలతా నీవే గాన లతా …
దేశమాత ముద్దుబిడ్డవై వెలిగే రత్న లతా ..
||ఓహో సౌమ్యలతా||
చరణం1:
దీనానాథుని ముద్దుబిడ్డవై వికసిత గానలతా
ఆశతో గానము చేసిన పలుకే రాగలతా
ఉష:కాలరాగజ్యోతికలశము వెలిగిన ఉషాలతా
కన్నడ గీత బెల్లెన బెలగాయితు ఆడే మీనలతా
||ఓహో సౌమ్యలతా||
చరణం2:
“అయే మేరే వతన్ కే లోగోం జరాఆంఖ్మే భర్ లో పానీ” దేశభక్తి తో కొలిచి
స్వరములకలిపిన “మిలే సుర్ మేరా తుమ్హారా” అని రాగ మాధురి
ఝరి లో ఓల లాడిన గాన లతా హృదయ నాథుని స్వర రచనల అండ ;
పులకించిన శ్రోతల గళములలో మదినిండే స్వర లతా
|| ఓహో సౌమ్యలతా ||
చరణం 3:
కూరిమి తోడ వీనుల విందుగా హృదయ తరంగ
మృదంగ ధ్వని కలవో భావాలతా
శ్రోతల శ్రవణం, రోగ హరణ ఆహ్లాదజననమే
సంగీత , గాత్ర మేళన వీవే ఆరోగ్యాలతా
||ఓహోసౌమ్యలతా||
చరణం 4:
కీర్తి శిఖరముల చేరిన విశ్వ యశోలతా
సకల జనుల సన్మోహన పరిచే నీవే మోహలతా
చిరకాలంగా చిత్రసీమలో వెలిగే కాంతిలాతా
మీ గాత్రమే సంగీతములో అజరామర లతా