STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

జగమంతా...

జగమంతా...

1 min
206

పదము కదిలితే పథము సాగెనే

మెలిక తిరిగితే మలుపు కలిగెనే

కనుల కొలనులో కలలే కలువలాయెనే

కన్నీటి రుచిని సంద్రాలు కోరి పొందెనే

ఆడుతున్న తనువంతా

నటనమాడుతున్న తపనేనా

జగడమాడుతున్న జగమంతా

నీ కాలి మువ్వ సాటి కాదననా

తాళమే సాగుతుంటే

అడుగు లయగా మారేనే.

భూగోళమే కదులుతుంటే

నటరాజు తాండవమాడేనా

నయన కొనల కాటుకలు

కరిగి కన్నీటి చారికలయ్యేనా

ముసురుకున్న మబ్బులన్నీ చూసి

మయూరమే నాట్యమాడెనా...



এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar telugu poem from Inspirational