STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

జారుతున్న వాననీరు

జారుతున్న వాననీరు

1 min
333

రేకుల షెడ్డు మీద నుంచి

పూరిల్లు చూరు నుంచి

బాదం చెట్టు ఆకు మీద నుంచి

వాన నీరు జారుతోంది


చెలి శిరోజాల పైనుంచి

చామంతి పూల పైనుంచి

విమానపు రెక్కల పైనుంచి

వాన నీరు జారుతోంది


శివుని జటాజూటము నుంచి

గంగమ్మ పొంగింది

పుడమి తల్లిని తడిపి

సిరుల పంటలు పండించ


వాన నీరు నేల మీదకు జారుతోంది

జారుతున్న వాన నీరు

కవికి ఎన్నో రచనల్ని బహుమతి ఇస్తోంది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract