జాగు
జాగు
ప౹౹
జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు
జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు |2|
చ||
జాము రాతిరైన ఆనవాలే లేక ఆశొదలాల
గోముగా పిలిచినా పలుకవు నేనే కదలాల |2|
మందహాసం మరచి చంద్ర సాయం కోరానే
దరహాసంతో దరిచేరవా ఆ వెన్నెల తీరాన్నే|ప|
చ||
ఆనలన్ని చేసి ఆనవాయితీ మరచితివి కద
ఊసులన్ని ఊహలతోనేనింపి పండెనే ఎద |2|
కోరికలే కొత్త ఆశలతో చివురులే తొడిగాయి
తారకలే తహ తహగా ఎపుడని అడిగాయి |ప|
చ||
తొలి పలుకే తోరణమై తనువునెల్లా అల్లగా
మలి చూపులేక మదియే నీరసించే మెల్లగా |2|
వచ్చి వరద గోదారిల వలపించి గెలిపించు
నచ్చి నవపారిజాతంలా నను మురిపించు |ప|