జాగ్రత
జాగ్రత
జీవితాంకురాలకై చెప్పలేము
జీర్ణమయ్యే వానికి చెప్పలేము
జీవిత మధ్యస్థ జీవాలకే నీ హితబోధ
జవ జవలాడు ప్రాయం వినదు కనదు
జీవిత కళ్యాణ ఘట్టంలో మట్టమైన
జీవితాలే అన్నీ గిల్టీగా విని విరిసేవి కొన్ని
జంభూ ఫలంలా పండినా పనికి రానిదే
జనహృదయాల్లో జఠిల ఫల రసంలా
జాగృత మయ్యేవి కొన్ని జావలా నిత్యం
జావగారి పోయేవి మరి కొన్ని జీవితాలు
జీవం కోల్పోతున్నప్పుడు తిరిగి రాని
జీవిత మాధుర్యం అదృశ్య మౌతున్నప్పుడు
జల సంధి అంతరించి పోతున్న సమయాన
జాగృత మవ్వాలని జడిసి తలచేదే నీ బోధ..!!
. సిరి ✍️❤️

