🌹 జాబిలి - వెన్నెల🌹
🌹 జాబిలి - వెన్నెల🌹
🌹జాబిలి -వెన్నెల🌹
రచన :- అంజనీ గాయత్రి.
వేలతారలు ఉన్నా , చూసేందుకు వేయి కన్నులు ఉన్నా ,
నిశిరాతిరిలో కూడా చల్లదనాన్ని చిమ్ముతూ,
వెలుగులు పంచుతూ,
నీ నిండైన రూపంతో కనువిందు చేస్తావు,
పడుచుజంట మదిలో మరులు గొలుపుతావు ,
మదిని నింపుతావు,
ఆకాశ వీధిలో నీ సోయగాన్ని ప్రకాశింపచేస్తూ, హృదయాన్ని పరవశింప చేస్తావు, ఓ నిండు జాబిలి!!
నిండు పున్నమిలో నింగిలో నెలవంక వెదజల్లే వెలుగులే "వెన్నెల " ,
ఆ వెన్నెల వెలుగులో రారాజులా నెలరాజు, తారకలతో కలిసి నింగిని ఏలుతూ మనల్ని మురిపిస్తాడు,
తన అందచందాలతో వెలుగు జిలుగులతో నింగినుండి నేలదాకా
వెన్నెలను కురిపిస్తాడు, వసంతాలు పూయిస్తాడు, ఇంద్రుడు లాంటి చంద్రుడు! ఓ వెన్నెల!ఓ నిండు జాబిలి !!
