ఇంకా ఏదో ఆశ
ఇంకా ఏదో ఆశ


ఇంకా ఏదో ఆశ
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని
జరిగినవన్నీ కల్పితమని చెట్లకి చెప్పాను
పిచ్చుకలకు చెప్పాను
పిచ్చన్నారు నాకు
ఎలా చెప్పను వారికి
ఇది ప్రేమని
నా ప్రేమకు అంతు లేదని
అదింకా నిన్ను ఆరాధిస్తోందని
నీకోసం ఎదురు చూస్తోందని
పిచ్చా నాది
కాదని చెప్పవా?
ఒక్కసారి రావా
శ్రావణ మాసపు తొలకరిలా
కార్తీక దీపపు వెలుగులా
ఒక్కసారి రా
నే చెప్పేది విను
ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు
నీ కోసం అన్నీ వదులుకున్న వ్యక్తికి
ఒక్క అవకాశం ఇవ్వలేవా
నీమీద నమ్మకంతో
ఎదురు చూస్తున్నా
నువ్వు వస్తావని
ఇంకా ఏదో ఆశ