ఇకనైనా
ఇకనైనా
చందమామ దిగులేమో..తీరేనా ఇకనైనా..!
కాలుష్యపు సాలెగూడు..కాలేనా ఇకనైనా..!
మంచినీటి నదులకు..రసాయనాల తరలింపా..
బుద్ధిలేని తనమేదో..వదిలేనా ఇకనైనా..!
ఏ గ్రహాల పైన కాలుమోపి లాభమేమి ఒరిగె..
అహంకారాగ్రహాలే..రాలేనా ఇకనైనా..!
ప్రకృతికన్నె సొగసులెల్ల..విధ్వంసపు పాలేనా..
అందాలకు సంరక్షణ..అందేనా ఇకనైనా..!
నిదానమను నిధి ఉన్నది..నీ శ్వాసల కోవెలలో..
అసలుసత్య దీపమేదొ..వెలిగేనా ఇకనైనా..!

