ఈశ్వరా!
ఈశ్వరా!


ఇటుకతో చేసిన శరీరం
చిటికెలో ముగిసే జీవితం
ఇసుకతో చేసిన మనసు
మసకలో ముగిసే వయసు
ఈ కాస్తంత పర్యాయములో
నిన్ను చేరేదమను భ్రమలో
సమతల నామం దాల్చినంత
మాత్రమున చేరేనా నీ చెంత
వెర్రివాళ్ళు వారి మనసులని
స్వార్ధరాగద్వేషాలతో నింపి
పూర్ణముగా రోతగాంచి
తమని తామే వంచించి
నీ వద్దకు వచ్చితిరే
శృంగారించబడ్డ మేనుతో
కానీ మరచితిరే
వచ్చారని ఎదన చోటు లేమితో!
ఈ కాలమున
కలికాలమున
పూర్ణ మనసుతో నిన్ను చేరు
ఉపాయము తెలిసినవారు
ఎవరుంటిరి ఈశ్వరా!
అటులని
నీవిచట లేకపోలేదు!
ఇటులని
మా పిలుపు వినవనీ కాదు!
విరాట్ స్వరూపుడైనటువంటి నీ
ఉనికిని ప్రేశ్నించ చోటేది మహానుభావా!
లోకమంతా నిండితివిగదా నీ
కింకా కదిలే చోటెక్కడుంది స్థాణువా?
నీవైన కవనంతో
నీపైన కవిత్వము
రాయదలచితినే
విడ్డూరంగా లేదూ!
ఇంపైన పదాలతో
కెంపువంటి వాడివని
కెంపుని సృష్టించిన నిన్నా
కెంపుతో పోల్చితిని
తెంపైన కవిని క్షమించవూ?