STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

ఈశ్వరా దయ చూపరా

ఈశ్వరా దయ చూపరా

1 min
297

ఎరుక లేని వాడను

నిన్నెరుగుదునని వచ్చి

నన్ను నేను కలుసుకుంటి ఈశ్వరా

నాలో వున్నా నిన్ను నేను తెలుసుకుంటి ఈశ్వరా


మనసులోని విషాన్ని ఉమ్మెత్తగా మార్చాను

నీ శిరసున ఉంచాను

పాషాణములాంటి నా ఆలోచనలను జిల్లేడని తలచాను

వాటిని నీకే అర్పించాను 


నీ మందిరమే నాకు స్వర్గమని తలచాను

భస్మం ధరించి మోహం త్యజించి

నీవే కావాలని నిన్నే కోరాను

 

ఇంకనైనా దయ చూపరా ఈశ్వరా

ఈ ప్రాణిని నీలో ఐక్యము కానీయరా

శంభో శంకరా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract