ఈ వలపుల దారాలే
ఈ వలపుల దారాలే
ఈ వలపుల దారాలే..బంధించుట బాగున్నది..!
ఈ మనస్సు ఖాళీగా..ఊరేగుట బాగున్నది..!
విరహమిలా ఏకాంతపు..పరిమళమై మత్తుజల్లె..
కలలవీణ రాగసుధలు..మేల్కొల్పుట బాగున్నది..!
పగలైనా రేయైనా..ఒకేతీరు ఉన్నదిపుడు..
రేపటిపై గొప్ప ఆశ..ఊరించుట బాగున్నది..!
నీవెవరో నేనెవరో..కలిసి ఒక్కటైనామా..
పూలపడవ పాలనదిలొ..పయనించుట బాగున్నది..!
ఈ ఊహా క్షేత్రానికి..నీ ప్రేమయె తొలిబీజం..
అక్షరాల సేద్యమిలా..కొనసాగుట బాగున్నది..!
కాలుతున్న వత్తి చూస్తు..నవ్వుకొందు లోలోనే..
చావుపుట్టుకల చక్రం..వదిలేయుట బాగున్నది..

