ఈ వేళా
ఈ వేళా
సాగరమే జలకన్యగ మారినదా ఈవేళా
జలవలువతొ వలయంగా మారినదా ఈవేళా..
అంబువుతో అంబరాన్ని చుంబించగ పయనమా
ఆశ్రయాన్ని కోరుతూనె చేరినదా ఈవేళా.
అతిలోకా సౌందర్యమె తనసొంతం చేసుకునీ
పుడమివీడి కన్నియగా మారినదా ఈవేళా..
ఆకాశమె తనహద్దని ఆశతోని పరుగులిడుతు
సంద్రమేను పడతిగాను మారినదా ఊవేళా..
మెరుపులతో మబ్బులను చేరుటనే కోరుకుంటు
ప్రేమతోను మీనాక్షిగ మారినదా ఈవేళా..
