ఈ ఉదయం
ఈ ఉదయం
ప్రతి రోజూ పుష్పిస్తూనే ఉన్నా
వెలుగునై ఉదయిస్తూనే ఉన్నా
ఆశనై ఉవ్వెత్తున కెరటాన్నవుతున్నా
జీవితం ఇదే అనుకున్నా
పుష్పించాక వాడిపోక తప్పదని
ఉదయపు వెలుగు అస్తమిస్తుందని
ఎగిసిన కెరటం పడిపోతుందని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
సుఖం వెంట కష్టం
వెలుగు వెంట చీకటి
ఆశ వెంట నిరాశ
ఒకదాని వెంట ఒకటని
ఇదే జీవితం అని !!!
... సిరి ✍️❤️
