ఈ రోజే..
ఈ రోజే..
ఈ రోజే రాశానూ ఒక ఉత్తరం తెలుసుకొని
నా రాజు ఏం చేస్తున్నాడో అని తలచుకొని ౹2౹
చ౹౹
మదిలోనూ మత్తు పెరిగే ఆ జ్ఞాపకంతోను
అది మొదలు చిత్రం జరిగే వ్యాపకంతోను౹2౹
కలవరించి మనసూ ఆ కలలతోనే నిండినే
కల వరించి ఆ కోరికేదో కోరినట్లూ పండినే ౹ప౹
చ౹౹
కుశలమేగా ఆశలన్నీ అదనులోనే తీర్చగా
కుశలతే కూర్పుగ ఊహల్నీ ఒకటై పేర్చగా ౹2౹
ఒకనాటి తీపి గురుతులే తీయని రాగాలై
ఆ మేటి తలపులు మిగిలే మది సరాగాలై ౹ప౹
చ౹౹
రాసుకుంటున్నా రాయంచ కులుకుతోను
నెమరేసుకుంటున్నా ఆపొద్దు అలకతోను ౹2౹
గూడుకట్టిన ప్రేమనూ గుబాళింపులతోను
నేడుపట్టిన పారవశ్యపు ఆకళింపులతోను ౹ప౹