ఈ పున్నమి
ఈ పున్నమి
ఎప్పటికీ ఏమాత్రం..తరగనిదే ఈ పున్నమి..!
నీవు-నేను ఏకమైన..మాయనిదే ఈ పున్నమి..!
ఏ జాబిలి ఏ కడలితొ..మునిగిందో ప్రేమలోన..
మనకుగాక మరి ఎవరికి.. దక్కనిదే ఈ పున్నమి..!
ప్రేమతోటి ఎవరికైన..తప్పదులే గొడవన్నది..
ఏమైనా ఎంతైనా..తియ్యనిదే ఈ పున్నమి..!
నా రాజులు నీవుకాగ..నారాజే కాలేనులె..
కలనైనా ఏనాటికి..కరగనిదే ఈ పున్నమి..!
కోరికలకు అతీతమై..వెలుగుతున్న దివ్వెలమే..
గగనమంత మౌనంలా..వాడనిదే ఈ పున్నమి..!

