ఈ జవాబుకు మీ ప్రశ్న.
ఈ జవాబుకు మీ ప్రశ్న.


నేరం చేసినవాడిముఖం నిండా
తప్పుడుమేఘాలు
చర్మంతో మమేకమై చీకటిని వెదజల్లుతూనే ఉంటాయి...
మనసులోని వికృతమంతా
ముఖంలోకి చిమ్ముతున్నప్పుడు
దానిని కమ్ముతూ అమాయకత్వం
నాట్యమాడుతూనే ఉంటుంది.
ఆటవిడుపుగా చేసిన నేరం
అడివిని కాల్చేసే కార్చిచ్చు అవుతుందని తెలియని
బొమ్మలాటలో...చూపుడువేళ్ళ
వలయం మధ్య దోషులుగా
నిలబెట్టినప్పుడు నిస్తేజమైన
అభిమాన్యులు వాళ్లిప్పుడు...
నిరసించి, నిందించి, నాశనం కోరడం
ధర్మమే....
కాని మనం చేయాల్సింది ఒక్కటే...
మానవత్వపు మధురిమ రుచిచూపించడం...
మమతల పాఠాలను నేర్పడం...
కారణ్యపు అమృతంతో
న్యూరాన్లను ప్రక్షాళన కావించి
మాతృత్వపు ప్రేమజైలుశిక్ష విధించడం...
కాలంతో పాటు కల్మషాలు కడిగేసుకుని,మాలిన్యాలను భూస్థాపితంచేసి కన్నీటిమేఘాలై
కురిసి కురిసి ఆవిరయ్యాకా
బయల్పడే ముఖాలకోసం...
నిరీక్షించడం మంచిదేమో...
ఆలోచిద్దాం,ఆలోచన చేద్దాం...!!!
***********