ఈ జీవితం
ఈ జీవితం
ముడుచుకున్న వదనం
కుసుమమై వికసించేదెన్నడూ
స్వార్ధమన్నది లేక
పరమళాలు చిందిస్తూ
పరవశించేది ఎన్నడూ
వాడిపోయి వడలి పోతున్నా
పువ్వులా రాలి పోతున్నా
అక్కున చేర్చుకున్న అవని
గర్భమున కుమిలి పోవడమే
స్రీ జ్యోతినైనా కొడిగట్టిన దీపమై
ఆరిపోతున్నా కొవ్వొత్తిలా
ప్రకాశిస్తూ కరిగి పోతున్నా
చమురు లేని ప్రమిదనై
శిశిర కాలాన నిరాశతో
వెను తిరగడమే మౌనమై
వెన్నెలన్నది మూడు దినాల
ముచ్చట కాదా ఈ జీవితం
రగులుతున్నది అంతకంతకు
ఆవేదన విస్ఫోటనంలా
చీకటి కమ్మిన కాలమే
మసకేసిన మబ్బులు
తూఫానులా కార్చిచ్చు
కాలి బూడిదైన జీవితం
విచారం కమ్మి రాలే పువ్వునై!!!

