హయికదా
హయికదా
కోపానికి కోపమింక వస్తేనే హాయి కదా..!
తాపానికి తాపమింక పుడితేనే హాయి కదా..!
మేఘమాల రాగాలకు..మురిసేనుగ ఈ పుడమియె..!
స్వప్నానికి స్వప్నమింక..తడితేనే హాయి కదా..!
ఊరేగే శ్వాసలలో..వెలుగుఊయలున్నదిగా..!
అద్దానికి అద్దమింక..పడితేనే హాయి కదా..!
హంసయాన దారులలో..మెరుపు తోటలున్నవిలే..!
చిత్తానికి చిత్తమింక..పెడితేనే హాయి కదా..!
తలపు పూల విత్తనాలు..పలకరించు తీరు చూడు..!
బీజానికి బీజమింక..విడితేనే హాయి కదా..!

