హరిత సౌందర్య
హరిత సౌందర్య
విఫణివీధి లభించని హేమంతపు విరి నీవు
గగనవీధి పున్నమిన నిశి రాతిరి శశి నీవు
అమరలోక ప్రాభవం, అలకాపురి వైభవం
ఇహలోకము నేగంటి సురలోకపు సుందరిని
గులాబీల లేపనమూ అద్దుకున్న అధరములూ
చుంబించగ పిలుపిచ్చే ఆహ్వానపు పత్రములే
నీమోమను సరస్సులో విరబూసిన కలువలనా
నీకన్నుల సోయగమూ లంగరేసె నామనమూ
నీజబ్బల నునుపుదనం నీబుగ్గల బిరుసుదనం
నీవన్నె చిన్నెల ఝరి మదితడిసి ముద్దాయే
నీమేని వర్ణము నీలేత ప్రాయము యెదగిల్లే
నాజూకూ పొంకాలా పొందుగోర మనసాయే
చిలకపచ్చ చీరకొంగు పరదాలో వజ్రంలా
సాంద్రశిలల ఘనమైనా పరువాలా పడుచందం
కనికరించి కరుణజూపి ననువరించ అనుమతిస్తె
నాజన్మం సార్థకమై స్వర్గసీమ లేలుదులే

