హృదయ వీణ
హృదయ వీణ
మ్రోగుతున్న హృదయవీణ..తంత్రులలో ఉందేమో..!
లాలించే ప్రణయవేణు..రవములలో ఉందేమో..!
ప్రేమకు ఒక రూపమేదొ..ఇవ్వాలను ముచ్చటేల..
అక్షరాల గుండెలయల..పరుగులలో ఉందేమో..!
నీవు-నేను ఏకమైన..సంబరమే ఏకాంతము..
ఆ వెన్నెల సోయగాల..తరువులలో ఉందేమో..!
నిజమన్నది దాగున్నది..కలలగగన వీధులలో..
సరసస్వర పరిమళాల..దారులలో ఉందేమో..!
ఇది నేనని..ఇది నాదని..పలుకగల్గు సంగతేమి..
మౌనమైన తేనెమబ్బు..చినుకులలో ఉందేమో..

